Monday, August 13, 2007

నేను తెలుగు వాణ్ణి

నేను తెలుగు వాణ్ణి। నా పేరు మిస్సల ఫణి। నా పూర్తి పేరు మిస్సల ఫణి వెంకట రామారావు। నన్ను అందరూ ఫణీ అని పిలుస్తారు। ఇక పోతే ఇది నా రెండవ బ్లాగు। మొదటి బ్లాగు కేవలం ఆంగ్లం లో ఉంటుంది। నా ఈ ప్రస్తుత బ్లాగు పూర్తిగా తెలుగు లో వ్రాయాలని నేను ప్రయత్నిస్తున్నాను।

నా మొదటి బ్లాగును తెలుగు లో వ్రాస్తున్నాను। నేను ఒక భారతీయుణ్ణి। నా భార్య పేరు అనిత। మా ముద్దుల బాబు పేరు సత్యం। నేను 2002 సంవత్సరం లో అహ్మదాబాదు లోని గుజరాత్ విశ్వవిద్యాలయం నుండీ గణితశాస్త్రం లో పట్టభద్రుణ్ణయ్యాను। మరి నా భార్య అదే విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రంలో పట్ట భద్రురాలు। నేను ఈనాటికి (సెప్టెంబర్ ४, २००७) ३० సంవత్సరాల వయసు కలిగి ఉన్నాను। నేను ఒరిస్సా రాష్ట్రం లోని కటక్ నగరంలో జన్మించాను। మా నాన్నగారి పేరు స్వర్గీయ శ్రీ మిస్సల వీర వెంకట సత్యన్నారాయణ మూర్తి మరి అమ్మ పేరు శ్రీమతి జయలక్ష్మి। మా నాన్నగారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసేవారు। దురదృష్ట వశాత్తు ఆయన ఒక దారి ప్రమాదంలో మరణించారు। అప్పుడు మేము ఢిల్లీ నగరం లో ఉండేవాళ్ళం। మా అమ్మగారు ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం వారిచే నెలకొల్ప బడిన ప్రాధమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయిని గా పనిచేసి పదవీ విరమణ చేశారు। నాకు ఒక చెల్లెలు ఉన్నది। ఆమె పేరు మిస్సల పార్వతి పృథ్వి। ప్రస్తుతానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండీ తెలుగు లో ఉన్నత పట్ట భద్రురాలై అత్యున్నత విద్యనభ్యసించడానికి తయారు అవుతున్నది। నేను భారతీయుడనైనందుకు చాలా గర్విస్తున్నాను।

నాయెక్క ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పెద్దాపురంలో జరిగింది। మధ్యంతర విద్య కాకినాడ లో పూర్తిచేసినాను। నేను జాతీయ దండు పటాలములో చేరితిని। సమూహపు స్థాయిపోటీలలో చిన్నవారి విభాగం పెద్దవారి విభాగాల దండులలో ఉత్తమ దండు సభ్యుని గా నిలచితిని। २ జాతీయ స్థాయి ८ రాష్ట్ర స్థాయి ३ సమూహపు స్థాయి శిక్షణా శిబిరాలలో పాల్గొన్నాను।

నేను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఐన హైదరాబాదు లోఉన్నటువంటి ఉన్నతసాంకేతిక నగరం లోని డిలోయిట్ టూచ్ తోమాస్ (స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఒక కూటమి) అనే అంతర్జాతీయ సంస్థలో విశ్లేషకుడిగా పనిచేయుచున్నాను। ఇంతకు ముందు భారత రాజధాని ఐన ఢిల్లీ నగరంలో నెలకొల్పబడిన ఇంటెక్స్ సాంకేతికాల భారతదేశపు ప్రభుత్వేతర పరిమిత సంస్థలో యాజమాన్యపు విషయయంత్రాంగము అమలుపరచు ఉద్యోగిగా పనిచేసేవాడిని। నేను మైక్రోసాఫ్టు కార్యాలయం २००३ అనే సాంకేతిక మృదుపరికరముపై అత్యంత సమర్థవంతంగా పనిచేయగలను। మైక్రోసాఫ్టు అద్భతగళ్ళు, మైక్రోసాఫ్టు బాహ్యదృశ్యం అనే పరికరాల్లో కార్యక్రమాలను కూడా వ్రాయగలను। మీటలబల్లపై మంచి పరిఙ్జానం (సులువు దారులు బాగా తెలుసు) ఉన్నది। ఆంగ్లం, హిందీ, తెలుగు భాషలను విద్యుల్లిపి లో బాగుగా వ్రాయగలను। ఈ మూడు భాషలలోనూ చదువుట, వ్రాయుట, మాట్లాడుట చక్కగా వచ్చును। నాకు ३ సంవత్సరాల ఉద్యోగానుభవం ఉన్నది.

2 comments:

Unknown said...

బ్లాగులోకానికి స్వాగతం.

మీ బ్లాగు జల్లెడకు కలపడం జరిగినది.

జల్లెడ

www.jalleda.com

కొత్త పాళీ said...

ఫణి గారూ, ఏదో యాదృఛ్ఛిక గూగులు వెదుకులాట వల్ల మీ ఈ బ్లాగు తగిలింది. తెలుగులో చక్కగా రాస్తున్నారు. ఈ పరిచయ వాక్యాలే కాక మీ ఆలోచనలు అనుభవాలు కూడా మీ బ్లాగు ద్వారా పంచుకోండి. కొన్ని వందలమంది ప్రపంచం నాలుగు మూలలనుండీ తెలుగులో బ్లాగులు రాస్తున్నారు. కొన్ని బ్లాగులను కూడలిలోనూ, జల్లెడలోనూ చూడవచ్చు.
koodali.org
jalleda.com